భీమ్ శిల - కేదార్ నాథ్ వరదలు
2013 లో ప్రకృతి
ప్రకోపానికి ఉత్తరాఖండ్ వరదల్లో
మునిగిపోయింది. ఎంతో జననష్టం, ఆస్తి నష్టం జరిగింది కానీ కేదార్‌నాథ్ ఆలయానికి మాత్రం ఎలాంటి నష్టం వాటిల్లలేదు. ఆ సమయంలో
అక్కడ భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఇక ఈ వరదల్లో వేలాది ఇళ్లు పూర్తిగా కొట్టుకుపోయాయి…
ధ్వంసమయ్యాయి, వేలాది మంది మరణించారు. పెద్ద పెద్ద కట్టడాలు
కూడా పేకమేడల్లా కుప్పకూలిపోయాయి… అలాంటి సమయంలో కేదార్నాథ్ ఆలయంలో వందల మంది భక్తులు
చిక్కుకుపోయారు…
అలాంటి సమయంలో ఇంకా భయపెట్టడానికి అన్నట్టుగా ఎంతో ఎత్తు మీద నుంచి ఒక పెద్ద ఏకరాతి శిల కొట్టుకుంటూ, దొర్లుకుంటూ వచ్చింది. అంత భారీ శిల గనక ఆలయాన్ని ఢీకొంటే మాత్రం అంతా ఇక ఐపోయినట్టే అనుకుని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. ఐతే ఆ రాయి అలా దొర్లుకుంటూ వచ్చి గుడికి కొంచెం వెనకగా పడి ఇక అక్కడితో ఆగిపోయింది. ఆ భారీ శిల ఈ వరద ప్రవాహాన్ని రెండు పాయలుగా చీల్చేసరికి వరద గుడికి రెండు వైపులా నుంచి శరవేగంగా వెళ్ళిపోయింది. దాంతో ఆలయానికి ఎం కాలేదు. భక్తులు కూడా హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. గుడి సేఫ్ గా ఉంది.
ఆ రాయే భీమశిల. ఇప్పటికి కూడా భక్తుల చేత
పూజలందుకుంటోంది. భీమశిల గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే కింద వీడియో చూడండి.`


కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి