మానా,
సరస్వతీ నది పుష్కరాలు జరిగే ప్రదేశం,
పాండవులు స్వర్గారోహణ చేసిన ప్రదేశం,
మహాభారత గ్రంధం
పుట్టిన ప్రదేశం,అది సరస్వతీ నది పుష్కరాలు జరిగే ప్రధాన స్థలం.
ఇండో... టిబెటన్ సరిహద్దుల్లో ఉన్న ఈ గ్రామం ఈ రెండు దేశాలకు ఒకప్పుడు ప్రధాన
వాణిజ్య మార్గం.
మహాభారత గ్రంధం పుట్టిన ప్రదేశం. అంతర్వాహినిగా ప్రవహించడమే తప్ప ఎక్కడా మానవ మాత్రులకు కనబడని సరస్వతి నది ప్రవాహం ప్రత్యక్షంగా చూడా లంటే అక్కడకు వెళ్ళాల్సిందే. మీకు పాండవులు స్వర్గారోహణ చేసిన ప్రాంతం చూడాలని ఉందా.. పాండవులు స్వర్గానికి వెళ్ళడానికి భీముడు కట్టిన వంతెన... భీమ పూల్ చూడాలనుకుంటున్నారా ... వ్యాసుడు ఆశువుగా చెప్తూ ఉంటె వినాయకుడు చకచకా మహాభారతం రాసిన చోటు చూస్తే ఎలా ఉంటుంది? ఆ చూడాలనుకున్నా చూడగలమా... అది సాధ్యపడే విషయం కాదు అనుకుంటున్నారా... ఖచ్చితంగా సాధ్యపడుతుంది. దేవభూమిగా పేరు పొందిన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మానా గ్రామం వెళితే ఇవన్నీ చూడవచ్చు. రెండేళ్ళ క్రితం వరకు భారతదేశపు చివరి గ్రామం గా చెప్పబడిన మానా గ్రామం ఇప్పుడు భారత దేశపు మొదటి గ్రామంగా పిలుస్తున్నారు... ఈ మార్పు ఎందుకు జరిగింది... బిజినెస్ ప్రమోషన్ లో ఈ మానా గ్రామ ప్రజలు అందే వేసిన చెయ్య అని చెప్పుకోవాలి... అదెలా... ఈ విశేషాలన్నీ ఈ క్రింది వీడియో క్లిక్ చేసి చూడండి
...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి