సరస్వతీ నది నిజంగా ఉందా? ఎప్పుడో ఉండేది తరువాత అంతర్హితమయిపోయింది అని చెబుతారు. సరస్వతీ నది అసలు ఉండేదా? లేక అన్నీ పుక్కిటి పురాణాల అన్న సందేహం కూడా మనకు వస్తుంది. కానీ ఆ నది ఉండేది అనడానికి చాలా ఆధారాలు ఉన్నాయి. ఎప్పుడో వేల క్రితమే అంటే కలియుగం ఆరంభం కాకముందే ద్వాపర యుగంలో అంటే మహాభారత కాలం నాటికే సరస్వతి నది అంతర్హితమవ్వడం మొదలైంది అని చెప్తున్నాయి కొన్ని కథనాలు. ఇది ఇది వేదకాలంనాటి నది. సప్తనదులు అని చెప్పే ఏడు పుణ్య నదులలో అన్నిటికంటే ఉత్తమమైనదిగా ఋగ్వేదంలో వర్ణించారు. నదులకు తల్లిగా, దేవతగా, ఉత్తమ నదిగా వర్ణించింది సరస్వతి నదిని ఋగ్వేదం. సరస్వతి నదిని ‘సింధుమాత’ అని పిలుస్తారు. అంటే నదులకు తల్లి అని అర్థం. ఇది కనపడకుండా ప్రవహిస్తుంది కాబట్టే దీనిని అంతర్వాహిని అని పిలుస్తారు.
సరస్వతి దేవే నది రూపంలో ప్రవహించిందని, నదీ దేవత అని
వేదాలలోను, పురాణాలలోనూ కూడా సరస్వతీ నది వర్ణన కనబడుతుంది. కురుక్షేత్రంలో అఘావతి
పేరుతో ప్రవహించే సరస్వతి నదిలో ఏడు నదులు సంగమించేవని చెపుతారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి