17, ఆగస్టు 2024, శనివారం

తిరుమలలో ఈరోజు(ఆగస్ట్16) భక్తుల ర వివరాలు

 


నమస్కారం అండి. ఈ రోజు పోస్ట్ లో కలియుగ వైకుంఠమ్ తిరుమల శ్రీవారి ఆలయంలో రద్దీ, దర్శన వివరాలు, మరికొన్ని విశేషాల గురించి తెలియచేస్తాను, ముందుగా శ్రీవారి ఆలయంలో దర్శన వివరాలు... 

నిన్న శుక్రవారం 62,625 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.  34,462 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. 3.63 కోట్ల హుండీ కానుకలు వచ్చాయి. భక్తుల రద్దీ చూస్తే విపరీతంగా పెరిగింది. మొత్తం కంపార్ట్మెంట్స అన్నీ నిండిపోయి. శిలాతోరణం వరకు క్యూ లైన్ ఉంది. టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు శ్రీవారి దర్శనానికి 18 నుంచి 24 గంటలు పడుతోంది.

    ఇక తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం శాస్త్రోక్తంగా ప‌విత్ర సమర్పణ జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో
శ్రీ జె.శ్యామలరావు దంపతులు పాల్గొన్నారు.






    ఈ సందర్భంగా ఉదయం యాగశాలలో హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. ఆ తరువాత సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం వేద ఘోష, మంగళవాయిద్యాల నడుమ శ్రీవారి మూలవర్లకు, ఉత్సవ మూర్తులకు, జ‌య‌విజ‌యుల‌కు, గ‌రుడాళ్వారుకు, వ‌ర‌ద‌రాజ‌స్వామివారికి, వ‌కుళమాత అమ్మ‌వారికి, ఆనంద నిల‌యం, యాగ‌శాల, విష్వ‌క్సేనులవారికి, యోగ‌న‌ర‌సింహ‌స్వామి వారికి, భాష్య‌కార్ల‌కు, పోటు తాయారుకు, ధ్వజస్తంభం, బ‌లిపీఠం, శ్రీభూవరాహస్వామివారికి, శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి పవిత్రమాలలు సమర్పించారు.

    అనంతరం సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో విహ‌రించి భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తారు. రాత్రి 8 నుంచి 11 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరుగనున్నాయి. ఈ కారణంగా శ్రీవారి ఆలయంలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది.

    ఇక తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం సందర్భంగా శుక్రవారం అమ్మవారు స్వర్ణరథంపై ఆశీనులై భక్తులను కటాక్షించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి ప్రపత్తులతో నాలుగుమాడ వీధుల్లో రథాన్ని లాగారు. కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు.





    స్వర్ణరథోత్స‌వంలో ఈవో శ్రీ జె. శ్యామల రావు దంపతులు, ఎస్ ఇ శ్రీ జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ గోవింద రాజన్, ఆల‌య అర్చకులు శ్రీ బాబుస్వామి, సూప‌రింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి, విశేష‌సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

 

 

    మరోవైపు తిరుమల శ్రీవారి ఆలయానికి కొప్పెర వారి పల్లికి చెందిన శ్రీ కామినేని శ్రీనివాసులు, కుటుంబ సభ్యులు కుప్పెర హుండీని బహుకరించారు.




    శ్రీవారి ఆలయం ముందు టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరికి దాత కొప్పెర హుండీని అందించారు.

    ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఇవి ప్రస్తుతానికి తిరుమల శ్రీవారి ఆలయంలో కొన్ని విశేషాలు. మరికొన్ని విశేషాలతో రేపటి పోస్ట్లో కలుసుకుందాం. నమస్తే

 

 

తిరుమలలో (ఆగస్ట్16) ఈరోజు భక్తుల రద్దీ,ఉత్సవాలు/tirumala latest news upd...