ఈ సంవత్సరం అంటే 2025 మే 15
నుంచి 26 వరకు సరస్వతీనది పుష్కరాలు జరగబోతున్నాయి. సరస్వతీ నది అదృశ్యమయిపోయింది
అంటారు కదా! మరి లేని నదికి పుష్కరాలేంటి? సరస్వతీనది అన్న పేరు
వినగానే... ఇంకెక్కడి సరస్వతీనది...ఎప్పుడో అదృశ్యమయిపోయింది
కదా! ప్రస్తుత కాలంలో సరస్వతీనది ఎవరికీ
కనబడదు... ఎప్పుడో లుప్తమయిపోయింది. ఉత్తరాఖండ్ లో బదరీనాథ్ సమీపంలో ఉన్న మానా
గ్రామంలో మాత్రమే కనబడుతుంది అంటారు కదా...! మరి మనం సరస్వతీ నది పుష్కర స్నానం
చెయ్యాలంటే ఉత్తరాఖండ్ వెళ్ళాల్సిందేనా? లేక తెలుగు
రాష్ట్రాల్లో కూడా ఈ సరస్వతీ నది పుష్కరస్నానం చేసే అవకాశం ఉందా? అసలు సరస్వతీ నది నిజంగా ఉందా?
ప్రపంచంలోనే అతి పెద్ద
ఆధ్యాత్మిక పండుగ కుంభమేళ ప్రపంచ దేశాల ప్రజలను ఆశ్చర్యంలో ముంచెత్తేలా, దాదాపు
నెలన్నర పాటు 65 కోట్ల మంది ప్రజా సంరంభంతో, వైభవం అన్నమాటకు నిజమైన అర్థాన్ని
చెబుతూ అంగరంగ వైభవంగా జరిగింది.
ఇప్పుడు భారతదేశం మరో అతి
ముఖ్యమైన ఆధ్యాత్మిక పండుగకు, సాంస్కృతిక ఉత్సవానికి సన్నద్ధమవుతోంది. అదే
సరస్వతీనది పుష్కరాలు. ఈ సంవత్సరం అంటే 2025 మే 15 నుంచి 26 వరకు సరస్వతీనది
పుష్కరాలు జరగబోతున్నాయి. పుష్కరం అంటేనే 12 అని అందరికీ తెలిసిందే కాబట్టి ఎన్ని
రోజులు జరుగుతాయి అన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పన్నెండు రోజులు జరుగుతాయి.
అసలు పుష్కరాలంటే ఏంటి? ఏ ఏ నదులకు జరుగుతాయి? 12 సంవత్సరాలకు ఒకసారే ఎందుకు జరుగుతాయి? ప్రత్యేకంగా కొన్ని నదులకు మాత్రమె ఎందుకు జరుగుతాయి? పుష్కరాల విశిష్టత ఏంటి? పుష్కరాల సమయంలో పాటించాల్సిన విధులు ఏంటి?
అసలు సరస్వతీ నదే
అదృశ్యమయిపోయింది అంటుంటే లేని నదికి పుష్కరాలేంటి? ఇలా చాలా అనుమానాలే కలుగుతాయి? ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ వీడియోలో క్లియర్ అవుతుంది. క్లిక్ చేసి చూడండి...
అసలు పుష్కరాలంటే ఏంటి? ఏ ఏ నదులకు జరుగుతాయి? 12 సంవత్సరాలకు ఒకసారే ఎందుకు జరుగుతాయి? ప్రత్యేకంగా కొన్ని నదులకు మాత్రమె ఎందుకు జరుగుతాయి? పుష్కరాల విశిష్టత ఏంటి? పుష్కరాల సమయంలో పాటించాల్సిన విధులు ఏంటి?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి