3, ఏప్రిల్ 2025, గురువారం

వందల ఆలయాలు నిర్మించిన అహిల్యాబాయి హోల్కర్,great story of rani Ahilyabai Holkar,

 


అహిల్యాబాయి హోల్కర్... ఏ ఆలయ చరిత్ర చూసినా తప్పక వినబడే పేరు. కాశీ
, ద్వారక, మథుర, ఉజ్జయిని, రామేశ్వరం, అయోధ్య, హరిద్వార్, జ్యోతిర్లింగాలు ఇలా అనేక పుణ్యక్షేత్రాల స్థల పురాణాల్లో ఆమె పేరు తప్పనిసరిగా వినబడుతుంది. భారతదేశమంతటా... ఆసేతు హిమాచలం వరకు మహమ్మదీయుల దాడులలో శిథిలమైన అనేక వందల ఆలయాలను పునర్నిర్మించి, పూర్వ వైభవాన్ని తీసుకువచ్చిన పుణ్య చరితురాలు. ఆలయాలను, నదీ తీరాలలో స్నాన ఘట్టాలను, ధర్మశాలలను నిర్మింపచేసి యాత్రికులకు యాత్రామార్గాలను సుగమం చేసిన పుణ్యాత్మురాలు.

భారతదేశం అంతటా ముఖ్యంగా దేశం ధార్మికంగా అల్లకల్లోలంగా, హిందూ ధర్మం, సంస్కృతికి విఘాతం ఏర్పడినపుడు, మన సంస్కృతికి, ధర్మానికి పట్టుకొమ్మలయిన దేవాలయాలను పునరుద్ధరించారు.

ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి, పరిపాలనాదక్షకురాలిగా, సామ్రాజ్య నిర్మాతగా, ముఖ్యంగా ఆలయాల నిర్మాతగా, పరమభక్తురాలిగా స్త్రీ శక్తిని దేశ నలుమూలలా చాటిన మహానుభావురాలు ఆమె. నారీశక్తికి నిలువెత్తు నిదర్శనం... ఆమే  రాణీ అహల్యాబాయి హోల్కర్. అహల్యాబాయి హోల్కర్ గురించి ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం...



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

సరస్వతీ నది నిజంగా ఉండేదా? లేక అన్నీ పుక్కిటి పురాణాలా?

           సరస్వతీ నది నిజంగా ఉందా? ఎప్పుడో ఉండేది తరువాత అంతర్హితమయిపోయింది అని చెబుతారు.  సరస్వతీ నది అసలు ఉండేదా? లేక అన్నీ పుక్కిటి పురా...