19, జులై 2024, శుక్రవారం

సింహగిరి ప్రదక్షిణకు సర్వం సిద్దం/మార్గదర్శకాలివే /vizag simhachalam giri pradakshina

 

భూప్రదక్షిణ తో సమానమైన ఫలితాన్నిచ్చే సింహాచలం గిరిప్రదక్షిణకు సర్వం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో గిరిప్రదక్షిణ సంబరం ప్రారంభమవబోతోంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు, పర్యవేక్షణ పూర్తయిందని దీనికి సంబంధించిన వివరాలను కూడా ప్రకటించారు అధికారులు.

గిరిప్రదక్షిణను పురస్కరించుకొని 20,21 తేదీల్లో రెండురోజులు ఆర్జిత సేవలు రద్దు చేసినట్టు ఆలయ అధికారులు ప్రకటించారు. ఈ నెల  20,21 తేదీలు రెండు రోజుల్లోను సింహాచలం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సుప్రభాతసేవ, ఆరాధన, నిత్యకళ్యాణం అష్టోత్తరం, సహస్రనామార్చన వంటి ఆర్జితసేవాలను రద్దు చేసినట్టు ఆలయ అధికారులు ప్రకటించారు. గిరిప్రదక్షిణ కారనంగాం భక్తులు లక్షల సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉంది  కాబట్టి ఈ రెండు రోజులు నీలాద్రి ద్వారం నుంచి మాత్రమె దర్శనాలకు అనుమతి ఇస్తున్నట్టు ఆలయ అధికారులు ప్రకటించారు.

అలాగే ఈ రెండు రోజుల్లోనూ అడవివరం, సింహాచలం ప్రాంతాలలోని మద్యం షాపులు మూసివాయాలని ఆ ప్రదేశాలలోని షాపులకు నోటీసులు కూడా జారీచేసారు. అలాగే giri ప్రదక్షిణలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు కూడా తీసుకుంటున్నట్టు అధికారులు ప్రకటించారు.

32 కిలోమీటర్ల మేర జరిగే ఈ ప్రదక్షిణలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసామని ప్రకటించారు. ఎక్కడికక్కడ వైద్య,కనీస అవసరాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. గిరిప్రదక్షిణ మార్గంలో 11 మెడికల్ క్యాంపులు, 290 తాత్కాలిక, 169 శాశ్వత మరుగుదొడ్లు, వంద సిసి కెమెరాలు అమర్చారు. ప్రధాన కూడళ్ళలో అంబులెన్స్ లను సిద్ధ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు సమాచారం తెలిపేలా అనౌన్స్మెంట్ సిస్టం కూడా అందుబాటులో ఉంచారు.

ఇప్పటికే సింహాచలం గిరిప్రదక్షిణ రూట్ మేప్ కూడా ప్రకటించింది. సింహాచలం తొలి పావంచా వద్ద మొదలుపెట్టి అడవివరం, ధారపాలెం, ఆరిలోవ, హనుమంతువాక, పోలీస్ క్వార్టర్స్, కైలాసగిరి టోల్ గెట్, అప్పుఘర్ జంక్షన్, mvp డబుల్ రోడ్, వెంకోజీపాలెం, hb కాలనీ కైలాసపురం, మాదవదార, మురలీనగర్, బుచ్చిరాజుపాలెం, లక్ష్మీనగర్, ఇందిరా nagar, ప్రహ్లాదాపురం, గోశాల జంక్షన్, నుంచి తోలిపావంచాకు చేరుకొని అక్కడినుంచి సింహాచలం మెట్ల మార్గం నుంచి ఆలయానికి చేరుకుంటారు.

సింహాచలం గిరిపదక్షిణ సందర్భంగా విశాఖ నగర పోలీస్ కమేశానర్ డా.శంఖబ్రత బాగ్చి.

ఆదేశాలతో రవాణాశాఖ  ట్రాఫిక్ ఆంక్షలు కూడా జారీ చేసింది. అనకాపల్లి నుంచి శ్రీకాకుళం, విజయనగరం వైపు వెళ్ళే వాహ్నదరులను విశాఖపట్నం సిటీ గుండా వెళ్ళడానికి అనుమతించరని తెలిపారు. విశాఖపట్నం సిటి నుంచి కాకుండా లంకెలపాలెం, సబ్బవరం,పెందుర్తి, ఆనందపురం ద్వారా వెళ్లాలని సూచించారు.

ఇక గిరిప్రదక్షినకు వచ్చేవారి వాహనాల పార్కింగ్ విషయంలో కూడా మార్గదర్శకాలు జారీ చేసారు. నడిచి వెళ్ళే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా పార్కింగ్ ఏర్పాట్లు చేసారు. విజయనగరం మార్గంల్ వచ్చి భక్తులు అడవివరం వద్దా, హనుమంతవాకవైపు నుంచి వచ్చేవారు సెంట్రల్ జైలు వద్ద రూరల్ ప్రాంతాల నుచ్న్హి వచ్చేవారు సింహపురి కాలనీలోను తమ వాహనాలను పార్కింగ్ చేసుకోవలసిందిగా సూచించారు.

సింహాచలం గిరిప్రదక్షిణకు సర్వం సిద్దం/మార్గదర్శకాలివే/about simhachalm g...

4, జులై 2024, గురువారం

వినాయకుడికి గరిక పూజ చాలా ఇష్టమని చెప్తారు. ఎందుకో తెలుసా...???

 వినాయకుడికి గరిక పూజ చాలా ఇష్టమని చెప్తారు. ఎందుకో తెలుసా...



           పూర్వం అనలాసురుడు అనే రాక్షసుడు అగ్ని పుట్టించి లోకాలన్నిటినీ తన దావానలంతో దహించి వేయసాగాడు. అనలాసురుని కారణంగా ఏర్పడిన వేడిని భరించలేని దేవతలందరూ అనలాసురిని బారి నుంచి కాపాడమని వినాయకుణ్ణి వేడుకున్నారంట. అప్పుడు వినాయకుడు ఒక్కసారిగా తన శరీరాన్ని పెంచి అనలాసురుని మింగేసాడంట! అనలాసురుని పీడ విరగడైనందుకు దేవతలంతా సంతోషించారు. కానీ అనలాసురుని మింగిన గణపయ్య శరీరం నుంచి విపరీతమైన అగ్ని పుట్టి గణపతి శరీరం మంటలు పుట్టసాగింది.

ఇక గణపయ్య శరీరంలో మంటలను తగ్గించడానికి దేవతలందరూ ఎన్నో ప్రయత్నాలు చేసారు. అన్నీ విఫలమయ్యాయి. గణపతి శరీరంలో మంటలు తగ్గలేదు. చివరకు కొంతమంది ఋషులు వచ్చి 21 గరిక పోచలు సమర్పిస్తే గణపతి శరీరంలో వేడి తగ్గుతుందని చెప్పడంతో  21 గరికలు  గణేశుని తలపై ఉంచగానే వినాయకుని శరీరంలో మంటలు తగ్గి ఉపశమనం కలుగుతుంది.



అప్పటినుంచి ఏ పని అయినా ఆరంభించేటప్పుడు, శుభకార్యాల సమయంలో గణపతిని గరికతో ఆరాధిస్తే నిర్విఘ్న్గంగా పనులు నేరవేరడమే కాకుండా సర్వ శుభాలు కలుగుతాయని గణపతి వరమిచ్చాడట.

ఈ ఆలయం గురించి వింటే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే / jagannath swamy temple uttarapradesh kanpoor

 

ఈ ఆలయం గురించి వింటే

దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే !!!



           భారతదేశంలో ఎన్నో హిందూ పుణ్యక్షేత్రాల్లో సైన్స్‌కు అందని అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి ఆలయాల్లో ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు 50 కి.మీ దూరంలో బెహతా గ్రామంలో ఉన్న జగన్నాథ్ ఆలయం ఒకటి. ఈ ఆలయంలో జరిగే అద్భుతం గురించి వింటే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. ఈ ఆలయం వర్షాకాలాన్ని ముందుగానే అంచనా వేసి చెబుతుందట. రుతుపవనాలు ఎప్పుడు వస్తాయి? ఏడాదిలో ఎంత వర్షం కురుస్తుంది? తక్కువా.. ఎక్కువా.. ఇవన్నీ చెప్తుందట. అందుకే ఈ జగన్నాథుని ఆలయాన్ని మాన్‌సూన్ టెంపుల్ అని పిలుస్తారట.



            రుతుపవనాల రాకకు కొన్ని రోజుల ముందు.. ఆలయ గర్భగుడి పైకప్పు నుంచి నీటి చుక్కలు పాడడం మొదలుతుంది. ఈ నీటిచుక్కల సైజును బట్టి ఆ ఏడాది ఎక్కువ వర్షాలు పడతాయా? తక్కువ పడతాయా? అనేది అంచనా వేస్తారట. జూన్ నెల ఫస్ట్ హాఫ్‌లో ఆలయ గర్భగుడి నుంచి చుక్కలు పడటం ప్రారంభమవుతుందట. ఈ ఆలయంలో జగన్నాథుని 15 అడుగులు నల్లరాతి విగ్రహంతో పాటు ఆయన సోదరుడు బలరాముడు, సోదరి సుభద్ర విగ్రహాలున్నాయి.

3, జులై 2024, బుధవారం

బయటపడబోతున్న పూరీ జగన్నాథుని రత్నభండార్ మిస్టరీ / ఆ మూడో గదిలో ఏముంది?

        జగన్నాథ దేవాలయం. కృష్ణభక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన ఆలయం. శ్రీకృష్ణ భగవానుడు సోదరి సుభద్ర సోదరుడు బలభద్రునితో కలసి కొలువుతీరిన ఆలయం. మానవ మేధస్సుకందని ఎన్నో రహస్యాలకు నిలయం ఈ పూరీజగన్నాథ దేవాలయం. అందులో రత్నభండార్ ఒకటి.

             అపార నిధి నిక్షేపాలకు, సంపదకు నిలయం రత్నభండార్

నిధి నిక్షేపాలున్న, తెరవడానికి వీలుకాని రహస్య గదులలో అపార సంపద గురించిన ప్రస్తావన రాగానే మనకు వెంటనే గుర్తొచ్చేది కేరళలోని అనంత పద్మనాభస్వామి ఆలయం. ఆ అనంత పద్మనాభస్వామి ఆలయం మాదిరిగానే పూరీ ఆలయంలో కూడా రత్నభండార్ లో కూడా అపార సంపద ఉందని నమ్ముతారు.

                      అనంతపద్మనాభుని ఏడో గది మాదిరిగానే

                       జగన్నాథుని రత్నభండార్ లో భీతర్ బండార్

       


జగన్నాథ ఆలయంలోని రత్నభండార్ లో స్వామికి సంబంధించిన విలువైన ఆభరణాలు, వజ్రవైడూర్యాలు ఎన్నో ఉన్నాయని చెప్తారు. ప్రసిద్ధ పూరీ శ్రీ క్షేత్రం జగన్నాథుడు అలంకార, భోజన ప్రియుడని భక్తులంటారు. ఆయన సన్నిధిలో సోదరీ సోదర సహిత జగన్నాథునికి నిత్యం ఉత్సవాలే. ఏడాదిలో 13 ప్రధాన ఉత్సవాలు. నాలుగుసార్లు ఊరేగింపులు అన్నిటి కంటే పెద్దదైన ప్రపంచ ప్రసిద్ద రథయాత్ర. ఆ వేేడుకల్లో ఆయా సందర్భాలలో నవరత్నాలు పొదిగిన స్వర్ణాభరణాలను స్వామి వారి రత్నభాండారం నుంచి తెచ్చి అలంకరిస్తారు. అది కూడా భాండాగారం మొదటి గదిలో నుంచి. అంటే బాహర్ భండార్ అని పిలువబడే వెలుపలి గడిలోనించి. అయితే లోపల ఇంకో గది ఉంది అదే భీతర్ భండార్ అని పిలిచే లోపలి గది. దశాబ్దాలనుంచి దానిలోనికి ఇప్పటివరకు ఎవరూ ప్రవేశించలేకపోయారు. దీంతో ఈ రత్నభండార్ లోని బీతార్ భాండాగారం అనేక ఏళ్లుగా అంతుచిక్కని రహస్యంగా మారింది.



                 ఇంద్రద్యుమ్న మహరాజుకు శ్రీ మహావిష్ణువు కలలో కనిపించి ఆదేశించిన ప్రకారం పూరీ ఆలయాన్ని నిర్మించినట్లు పురాణ కధనం. ముల్లోకాల్లోనూ ఇలాంటి క్షేత్రం మరొకటి లేదని పురాణాలు చెప్తున్నాయి.  ఈ ఆలయం నిండా సైన్స్ కు కూడా అంతుచిక్కని రహస్యాలున్నాయని చెబుతారు.ధర్మ సంస్థాపన కోసం ఆదిశంకరాచార్యుల వారు దేశంలోని నలుదిక్కుల్లో నాలుగు మఠాలను పీఠాలు ఏర్పాటు చేసారు. అందులో ఒకటి ఈ పూరీ క్షేత్రంలోనే ఉంది. ఇక్కడ జరిగే రథయాత్ర ప్రపంచ ప్రసిద్ధి చెందింది. మరికొన్ని రోజులలో రథయాత్ర జరగబోతోంది. ఇలాంటి సమయంలో ఇప్పుడు పూరి జగన్నాథ ఆలయం అందులోని రత్నభండార్ హాట్ టాపిక్ గా మారింది.



విజయవాడ దుర్గమ్మ ఆలయంలో తొలిసారిగా వారాహి ఉత్సవాలు/vijayawada durga temple festivals

 

విజయవాడ దుర్గమ్మ ఆలయంలో

తొలిసారిగా వారాహి ఉత్సవాలు



     విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయంలో మొదటిసారిగా వారాహి ఉత్సవాలను నిర్వహించనున్నారు. జులై 6 నుంచి 15 వరకు 9 రోజుల పాటు ఈ నవరాత్రులు జరుగుతాయని శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం ఈవో రామారావు ఆదివారం నాడు వెల్లడించారు. జులై 6న ఆషాడం మొదలవుతుందని, నెలరోజులపాటు ఆలయంలో ఆషాడమాస సారె మహోత్సవం నిర్వహిస్తామని ఆయన తెలిపారు. అమ్మవారికి భక్తులు సారె సమర్పణకు అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసినట్లు ఆయన చెప్పారు.

       ఇక, జులై 14న తెలంగాణ మహంకాళీ ఉత్సవ కమిటీ.. అమ్మవారికి బోనాలు సమర్పిస్తుందని పేర్కొన్నారు. జులై 19 నుంచి మూడు రోజులపాటు శాకాంబరీ దేవి ఉత్సవాలు జరుగుతాయని వివరించారు. మహానివేదన సమయంలో ప్రోటోకాల్‌ దర్శనాలు నిలిపివేయనున్నట్లు తెలిపారు. ఈ సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని.. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు వీఐపీ దర్శనాలు ఉండవన్నారు. 

          నవరాత్రుల్లో భాగంగా ప్రతి రోజూ సాయంత్రం వారాహిదేవికి అర్చనలు నిర్వహిస్తారు. చివరి రోజున వారాహి హోమం, పూర్ణాహుతి జరుగుతాయి.



జగన్మాతకు సంబంధించిన రూపాలను సప్తమాతృకలు అంటారు. ఆ ఏడు సప్త మాతృకలో ఒకరు వారాహి అమ్మవారు. పురాణాల ప్రకారం రక్తబీజుడు, శంభు, నిశంభు వంటి కొందరు రాక్షసుల సంహారంలో వారాహి అమ్మవారి ప్రస్తావన వస్తుంది. లలితా దేవి సర్వ సైన్య అధ్యక్షురాలే వారాహి అమ్మవారని పురాణాలు, గ్రంథాలలో పేర్కొన్నారు. అమ్మవారి రూపం వరాహ ముఖం. ఎనిమిది చేతులతో పాశం, నాగలి, శంఖ చక్రాలతో పలు ఆయుధాలు చేతబట్టి.. గుర్రం, సింహం, పాముపై సంచరిస్తుంది.



ఇక, లలితాదేవి స్వరూపమైన వారాహీ అమ్మవారిని పూజిస్తే అహంకారం తగ్గుతుందని అంటారు. వారాహీదేవిని పూజిస్తే కష్టాల నుంచి విముక్తి, శత్రునాశనం. వారాహీ అమ్మవారు సస్య దేవత కావడంతో ఈ తొమ్మిది రోజులు అమ్మవారు చిత్రపటాన్ని పొలం ఉంచి పూజలు చేస్తే పంటలు బాగా పండుతాయని నమ్మకం. అమ్మవారి ధ్యానం దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కల్పిస్తుంది. ఇక, జ్యేష్ఠ మాసం చివరిలో అమ్మవారి దీక్షను చేపడతారు. నవరాత్రుల వేళ ఎలాంటి నియమాలు పాటిస్తారో.. వారాహి నవరాత్రుల్లోనూ అలాగే కఠినంగా దీక్ష చేస్తారు.