3, జులై 2024, బుధవారం

బయటపడబోతున్న పూరీ జగన్నాథుని రత్నభండార్ మిస్టరీ / ఆ మూడో గదిలో ఏముంది?

        జగన్నాథ దేవాలయం. కృష్ణభక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన ఆలయం. శ్రీకృష్ణ భగవానుడు సోదరి సుభద్ర సోదరుడు బలభద్రునితో కలసి కొలువుతీరిన ఆలయం. మానవ మేధస్సుకందని ఎన్నో రహస్యాలకు నిలయం ఈ పూరీజగన్నాథ దేవాలయం. అందులో రత్నభండార్ ఒకటి.

             అపార నిధి నిక్షేపాలకు, సంపదకు నిలయం రత్నభండార్

నిధి నిక్షేపాలున్న, తెరవడానికి వీలుకాని రహస్య గదులలో అపార సంపద గురించిన ప్రస్తావన రాగానే మనకు వెంటనే గుర్తొచ్చేది కేరళలోని అనంత పద్మనాభస్వామి ఆలయం. ఆ అనంత పద్మనాభస్వామి ఆలయం మాదిరిగానే పూరీ ఆలయంలో కూడా రత్నభండార్ లో కూడా అపార సంపద ఉందని నమ్ముతారు.

                      అనంతపద్మనాభుని ఏడో గది మాదిరిగానే

                       జగన్నాథుని రత్నభండార్ లో భీతర్ బండార్

       


జగన్నాథ ఆలయంలోని రత్నభండార్ లో స్వామికి సంబంధించిన విలువైన ఆభరణాలు, వజ్రవైడూర్యాలు ఎన్నో ఉన్నాయని చెప్తారు. ప్రసిద్ధ పూరీ శ్రీ క్షేత్రం జగన్నాథుడు అలంకార, భోజన ప్రియుడని భక్తులంటారు. ఆయన సన్నిధిలో సోదరీ సోదర సహిత జగన్నాథునికి నిత్యం ఉత్సవాలే. ఏడాదిలో 13 ప్రధాన ఉత్సవాలు. నాలుగుసార్లు ఊరేగింపులు అన్నిటి కంటే పెద్దదైన ప్రపంచ ప్రసిద్ద రథయాత్ర. ఆ వేేడుకల్లో ఆయా సందర్భాలలో నవరత్నాలు పొదిగిన స్వర్ణాభరణాలను స్వామి వారి రత్నభాండారం నుంచి తెచ్చి అలంకరిస్తారు. అది కూడా భాండాగారం మొదటి గదిలో నుంచి. అంటే బాహర్ భండార్ అని పిలువబడే వెలుపలి గడిలోనించి. అయితే లోపల ఇంకో గది ఉంది అదే భీతర్ భండార్ అని పిలిచే లోపలి గది. దశాబ్దాలనుంచి దానిలోనికి ఇప్పటివరకు ఎవరూ ప్రవేశించలేకపోయారు. దీంతో ఈ రత్నభండార్ లోని బీతార్ భాండాగారం అనేక ఏళ్లుగా అంతుచిక్కని రహస్యంగా మారింది.



                 ఇంద్రద్యుమ్న మహరాజుకు శ్రీ మహావిష్ణువు కలలో కనిపించి ఆదేశించిన ప్రకారం పూరీ ఆలయాన్ని నిర్మించినట్లు పురాణ కధనం. ముల్లోకాల్లోనూ ఇలాంటి క్షేత్రం మరొకటి లేదని పురాణాలు చెప్తున్నాయి.  ఈ ఆలయం నిండా సైన్స్ కు కూడా అంతుచిక్కని రహస్యాలున్నాయని చెబుతారు.ధర్మ సంస్థాపన కోసం ఆదిశంకరాచార్యుల వారు దేశంలోని నలుదిక్కుల్లో నాలుగు మఠాలను పీఠాలు ఏర్పాటు చేసారు. అందులో ఒకటి ఈ పూరీ క్షేత్రంలోనే ఉంది. ఇక్కడ జరిగే రథయాత్ర ప్రపంచ ప్రసిద్ధి చెందింది. మరికొన్ని రోజులలో రథయాత్ర జరగబోతోంది. ఇలాంటి సమయంలో ఇప్పుడు పూరి జగన్నాథ ఆలయం అందులోని రత్నభండార్ హాట్ టాపిక్ గా మారింది.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి