4, జులై 2024, గురువారం

వినాయకుడికి గరిక పూజ చాలా ఇష్టమని చెప్తారు. ఎందుకో తెలుసా...???

 వినాయకుడికి గరిక పూజ చాలా ఇష్టమని చెప్తారు. ఎందుకో తెలుసా...           పూర్వం అనలాసురుడు అనే రాక్షసుడు అగ్ని పుట్టించి లోకాలన్నిటినీ తన దావానలంతో దహించి వేయసాగాడు. అనలాసురుని కారణంగా ఏర్పడిన వేడిని భరించలేని దేవతలందరూ అనలాసురిని బారి నుంచి కాపాడమని వినాయకుణ్ణి వేడుకున్నారంట. అప్పుడు వినాయకుడు ఒక్కసారిగా తన శరీరాన్ని పెంచి అనలాసురుని మింగేసాడంట! అనలాసురుని పీడ విరగడైనందుకు దేవతలంతా సంతోషించారు. కానీ అనలాసురుని మింగిన గణపయ్య శరీరం నుంచి విపరీతమైన అగ్ని పుట్టి గణపతి శరీరం మంటలు పుట్టసాగింది.

ఇక గణపయ్య శరీరంలో మంటలను తగ్గించడానికి దేవతలందరూ ఎన్నో ప్రయత్నాలు చేసారు. అన్నీ విఫలమయ్యాయి. గణపతి శరీరంలో మంటలు తగ్గలేదు. చివరకు కొంతమంది ఋషులు వచ్చి 21 గరిక పోచలు సమర్పిస్తే గణపతి శరీరంలో వేడి తగ్గుతుందని చెప్పడంతో  21 గరికలు  గణేశుని తలపై ఉంచగానే వినాయకుని శరీరంలో మంటలు తగ్గి ఉపశమనం కలుగుతుంది.అప్పటినుంచి ఏ పని అయినా ఆరంభించేటప్పుడు, శుభకార్యాల సమయంలో గణపతిని గరికతో ఆరాధిస్తే నిర్విఘ్న్గంగా పనులు నేరవేరడమే కాకుండా సర్వ శుభాలు కలుగుతాయని గణపతి వరమిచ్చాడట.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి