ఈ బ్లాగ్ లో పురాతన, మరుగున పడిన, రహస్యమయమైన ఆలయాలు వాటి వెనకున్న పురాణ, ఆధ్యాత్మిక, చారిత్రక, పర్యాటక ప్రాధాన్యత తెలుసుకోవచ్చు.
11, జనవరి 2026, ఆదివారం
27, అక్టోబర్ 2025, సోమవారం
29, సెప్టెంబర్ 2025, సోమవారం
26, సెప్టెంబర్ 2025, శుక్రవారం
4, ఏప్రిల్ 2025, శుక్రవారం
సరస్వతీ నది నిజంగా ఉండేదా? లేక అన్నీ పుక్కిటి పురాణాలా?
సరస్వతీ నది నిజంగా ఉందా? ఎప్పుడో ఉండేది తరువాత అంతర్హితమయిపోయింది అని చెబుతారు. సరస్వతీ నది అసలు ఉండేదా? లేక అన్నీ పుక్కిటి పురాణాల అన్న సందేహం కూడా మనకు వస్తుంది. కానీ ఆ నది ఉండేది అనడానికి చాలా ఆధారాలు ఉన్నాయి. ఎప్పుడో వేల క్రితమే అంటే కలియుగం ఆరంభం కాకముందే ద్వాపర యుగంలో అంటే మహాభారత కాలం నాటికే సరస్వతి నది అంతర్హితమవ్వడం మొదలైంది అని చెప్తున్నాయి కొన్ని కథనాలు. ఇది ఇది వేదకాలంనాటి నది. సప్తనదులు అని చెప్పే ఏడు పుణ్య నదులలో అన్నిటికంటే ఉత్తమమైనదిగా ఋగ్వేదంలో వర్ణించారు. నదులకు తల్లిగా, దేవతగా, ఉత్తమ నదిగా వర్ణించింది సరస్వతి నదిని ఋగ్వేదం. సరస్వతి నదిని ‘సింధుమాత’ అని పిలుస్తారు. అంటే నదులకు తల్లి అని అర్థం. ఇది కనపడకుండా ప్రవహిస్తుంది కాబట్టే దీనిని అంతర్వాహిని అని పిలుస్తారు.
సరస్వతి దేవే నది రూపంలో ప్రవహించిందని, నదీ దేవత అని
వేదాలలోను, పురాణాలలోనూ కూడా సరస్వతీ నది వర్ణన కనబడుతుంది. కురుక్షేత్రంలో అఘావతి
పేరుతో ప్రవహించే సరస్వతి నదిలో ఏడు నదులు సంగమించేవని చెపుతారు.
3, ఏప్రిల్ 2025, గురువారం
సరస్వతీ నది ప్రత్యక్షంగా కనబడే మానా గ్రామం, India's first village Mana near Badrinath Uttarakhand
మానా,
సరస్వతీ నది పుష్కరాలు జరిగే ప్రదేశం,
పాండవులు స్వర్గారోహణ చేసిన ప్రదేశం,
మహాభారత గ్రంధం
పుట్టిన ప్రదేశం,అది సరస్వతీ నది పుష్కరాలు జరిగే ప్రధాన స్థలం.
ఇండో... టిబెటన్ సరిహద్దుల్లో ఉన్న ఈ గ్రామం ఈ రెండు దేశాలకు ఒకప్పుడు ప్రధాన
వాణిజ్య మార్గం.
మహాభారత గ్రంధం పుట్టిన ప్రదేశం. అంతర్వాహినిగా ప్రవహించడమే తప్ప ఎక్కడా మానవ మాత్రులకు కనబడని సరస్వతి నది ప్రవాహం ప్రత్యక్షంగా చూడా లంటే అక్కడకు వెళ్ళాల్సిందే. మీకు పాండవులు స్వర్గారోహణ చేసిన ప్రాంతం చూడాలని ఉందా.. పాండవులు స్వర్గానికి వెళ్ళడానికి భీముడు కట్టిన వంతెన... భీమ పూల్ చూడాలనుకుంటున్నారా ... వ్యాసుడు ఆశువుగా చెప్తూ ఉంటె వినాయకుడు చకచకా మహాభారతం రాసిన చోటు చూస్తే ఎలా ఉంటుంది? ఆ చూడాలనుకున్నా చూడగలమా... అది సాధ్యపడే విషయం కాదు అనుకుంటున్నారా... ఖచ్చితంగా సాధ్యపడుతుంది. దేవభూమిగా పేరు పొందిన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మానా గ్రామం వెళితే ఇవన్నీ చూడవచ్చు. రెండేళ్ళ క్రితం వరకు భారతదేశపు చివరి గ్రామం గా చెప్పబడిన మానా గ్రామం ఇప్పుడు భారత దేశపు మొదటి గ్రామంగా పిలుస్తున్నారు... ఈ మార్పు ఎందుకు జరిగింది... బిజినెస్ ప్రమోషన్ లో ఈ మానా గ్రామ ప్రజలు అందే వేసిన చెయ్య అని చెప్పుకోవాలి... అదెలా... ఈ విశేషాలన్నీ ఈ క్రింది వీడియో క్లిక్ చేసి చూడండి
...
వందల ఆలయాలు నిర్మించిన అహిల్యాబాయి హోల్కర్,great story of rani Ahilyabai Holkar,
అహిల్యాబాయి
హోల్కర్... ఏ ఆలయ చరిత్ర చూసినా తప్పక వినబడే పేరు. కాశీ, ద్వారక, మథుర, ఉజ్జయిని,
రామేశ్వరం, అయోధ్య, హరిద్వార్,
జ్యోతిర్లింగాలు ఇలా అనేక పుణ్యక్షేత్రాల స్థల పురాణాల్లో ఆమె పేరు
తప్పనిసరిగా వినబడుతుంది. భారతదేశమంతటా... ఆసేతు హిమాచలం వరకు మహమ్మదీయుల దాడులలో
శిథిలమైన అనేక వందల ఆలయాలను పునర్నిర్మించి, పూర్వ వైభవాన్ని తీసుకువచ్చిన పుణ్య
చరితురాలు. ఆలయాలను, నదీ తీరాలలో స్నాన ఘట్టాలను, ధర్మశాలలను నిర్మింపచేసి యాత్రికులకు యాత్రామార్గాలను సుగమం చేసిన
పుణ్యాత్మురాలు.
భారతదేశం అంతటా
ముఖ్యంగా దేశం ధార్మికంగా అల్లకల్లోలంగా, హిందూ ధర్మం,
సంస్కృతికి విఘాతం ఏర్పడినపుడు, మన సంస్కృతికి, ధర్మానికి పట్టుకొమ్మలయిన దేవాలయాలను పునరుద్ధరించారు.
ఒక సామాన్య
కుటుంబం నుంచి వచ్చి, పరిపాలనాదక్షకురాలిగా, సామ్రాజ్య నిర్మాతగా, ముఖ్యంగా ఆలయాల నిర్మాతగా, పరమభక్తురాలిగా స్త్రీ
శక్తిని దేశ నలుమూలలా చాటిన మహానుభావురాలు ఆమె. నారీశక్తికి నిలువెత్తు నిదర్శనం... ఆమే రాణీ అహల్యాబాయి హోల్కర్. అహల్యాబాయి హోల్కర్
గురించి ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం...
2, ఏప్రిల్ 2025, బుధవారం
సరస్వతీ నది ఎలా ఆవిర్భవించింది?
సరస్వతీనది
ఆవిర్భావం ఎలా జరిగింది అన్న పురాణ కథనం విషయానికి వస్తే, దేవీ భాగవతంలో ఒక కథనం ప్రకారం ఆ పరాశక్తి,
సృష్టికి ముందే ఐదు రూపాయలు ధరించిందట. అవి దుర్గా, రాధ, లక్ష్మి, సరస్వతి,
సావిత్రి. వారిలో జ్ఞానప్రదాయినిగా సరస్వతిదేవి భాసిల్లింది. ఈ తల్లిని మొట్టమొదట
శ్రీకృష్ణుడు మాఘ పంచమినాడు పూజించాడని, అప్పటి నుంచే
మాఘపంచమి నాడు అమ్మను ఆరాధించడం ప్రారంభించినట్లు చెప్తారు.
మరో పురాణ కథనం ప్రకారం బ్రహ్మదేవుడు ధ్యానంలో కూర్చున్నప్పుడు
అతడి నోటి నుండి ఒక అందమైన కన్య వెలికి వచ్చిందట. ఆ కన్యకు వాక్ అని పేరు పెట్టిన
బ్రహ్మదేవుడు సకల జనులకు వాక్ శుద్ధి ప్రసాదించే దేవతగా పండితుల నాలుకల మీద,
భూమిమీద నది రూపంలో రెండవ విధంగా,
ఇక మూడో విధంగా తనలోనే ఉండమని ఆమెను ఆశీర్వదించాడట. అలా సరస్వతి మాత భూమి మీద నది
రూపంలో ప్రవహించింది అని చెప్తారు.
ఇక పురాణ కథనాల్లో
సరస్వతీనదికి సంబంధించి, వివిధ కథనాలు మనకు కనబడతాయి. ఋగ్వేదంలో సరస్వతిగా
వర్ణించబడిన ఈ నది ఒకప్పుడు విశ్వామిత్ర మహర్షి శాప ఫలితంగా భూతప్రేతాలకు ఆలవాలంగా
మారిందట. వశిష్ట మహర్షిని బద్ధ శత్రువుగా భావించే విశ్వామిత్రుడు, వశిష్టుని
ఎలాగైనా పరాభవించాలన్న సంకల్పంతో సరస్వతీ నది తీరంలో సరస్వతి మాతను లింగాకారంలో
ప్రతిష్టించి ఆరాధించాడట. అతని భక్తికి మెచ్చిన సరస్వతీ మాత ప్రత్యక్షమై ఏం వరం
కావాలో కోరుకోమంది. తనకేమీ అక్కరలేదని, నదికి ఆవలి ఒడ్డున ఉన్న వశిష్టుని నదీ
జలాల్లో ముంచి తీసుకురమ్మని కోరాడు విశ్వామిత్రుడు. అయితే ఈ కోరిక చాలా అన్యాయము. పైగా సాత్వికుడు
తన భక్తుడు అయినటువంటి ఆ వశిష్ఠుడిని అలా చేయడానికి నిరాకరించింది సరస్వతీమాత.
దాంతో క్రోధానికి లోనయిన విశ్వామిత్రుడు, ఆ
నది భూతప్రాతాలకు పిశాచాలకు ఆలవాలంగా మారుతుందని శపించాడు. నది యొక్క దుర్దశను
చూసిన ఋషులు తమ యొక్క తపశక్తినంతా ధారపోసి సరస్వతీ నదిని సంరక్షించి
పూర్వవైభవాన్ని తెచ్చినట్టుగా ఓ కథనం.
ఈ సరస్వతి నది పశ్చిమ తీరాన ఉన్న బదరికా వనలోనే వ్యాసుడు భాగవత
కావ్యాన్ని వ్రాశాడు అని కూడా చెబుతారు. ఇది ప్రస్తుతం బద్రీనాథ్ సమీపంలో ఉన్న మాన
గ్రామానికి కొద్ది దూరంలో మనం చూడొచ్చు. ఇక బలరాముడు ద్వారకనుండి మధురకు
వెళ్ళినప్పుడు సరస్వతి యమునల మార్గంలోనే పయనించాడట. ఇలా ఎన్నో సందర్భాలలో సరస్వతీ
నది ప్రస్తావన మనకు కనబడుతుంది. సరస్వతి నది ఈ భూమ్మీద ఏడు పేర్లతో ఉద్భవించినట్టు
పురాణాలు చెబుతున్నాయి. అవి సుప్రభ, కాంచనాక్షి, విశాల, మనోరమ, సరస్వతి, ఒషువతి, సురేణువు,
విమలోదక.
ఒకసారి పుష్కర తీరంలో
బ్రహ్మదేవుడు యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞ ప్రభావంతో ఏ పదార్థాలను తలుచుకుంటే అవన్నీ
ప్రత్యక్షమయ్యాయట. దాంతో యజ్ఞం సుసంపన్నమైనట్టుగా భావించారందరూ. కానీ అక్కడ పరమ
పవిత్రమైన సరస్వతి నది జలాలు లేవు కాబట్టి యాగం పరిపూర్ణం కానట్టే అన్నారు
మునులు. అప్పుడు బ్రహ్మ కోరిక మేరకు అక్కడ ఆవిర్భవించిన సరస్వతి నది సుప్రభగా
పిలవబడింది. ఇక సరస్వతి నది మిగిలిన నామములు విషయానికొస్తే, నైమిశారణ్యంలో
సత్రయాగం చేస్తున్న మునుల కోరికపై కాంచనాక్షి గాను, గయలో గయ మహారాజు చేసిన యజ్ఞంలో
అతడి ఆహ్వానం మీద విశాల అన్న పేరుతోనూ, కోసల ప్రాంతంలో ఉద్దాలకుడు చేసిన యజ్ఞంలో
మనోరమగాను, కురుక్షేత్రంలో కురురాజు చేసిన యాగంలో సురేణువు గాను, హరిద్వార్ లో
దక్షుడు చేసిన యజ్ఞంలో సరస్వతి గాను, వశిష్టుని ఆహ్వానం మేరకు కురుక్షేత్రంలో ఓషువతి
అన్న పేరుతోను, హిమవత్ పర్వతం మీద బ్రహ్మ చేసిన యజ్ఞంలో విమలోదక అని ఈ సప్త
నామాలతో ఆవిర్భవించింది సరస్వతి నది. మరికొద్ది రోజుల్లో సరస్వతీ నది పుష్కరాలు జరగబోతున్నాయి. ఈ సందర్భంగా పూర్తి వివరాలు క్రింద వీడియోలో చూడండి...
సరస్వతీ నది పుష్కరాలు, తేదీలు, ఎక్కడ జరుగుతాయి? సరస్వతీనది నిజంగా ఉందా?
అసలు పుష్కరాలంటే ఏంటి? ఏ ఏ నదులకు జరుగుతాయి? 12 సంవత్సరాలకు ఒకసారే ఎందుకు జరుగుతాయి? ప్రత్యేకంగా కొన్ని నదులకు మాత్రమె ఎందుకు జరుగుతాయి? పుష్కరాల విశిష్టత ఏంటి? పుష్కరాల సమయంలో పాటించాల్సిన విధులు ఏంటి?
19, జనవరి 2025, ఆదివారం
21, డిసెంబర్ 2024, శనివారం
24, సెప్టెంబర్ 2024, మంగళవారం
1, సెప్టెంబర్ 2024, ఆదివారం
31, ఆగస్టు 2024, శనివారం
18, ఆగస్టు 2024, ఆదివారం
17, ఆగస్టు 2024, శనివారం
తిరుమలలో ఈరోజు(ఆగస్ట్16) భక్తుల ర వివరాలు
నమస్కారం అండి. ఈ రోజు పోస్ట్ లో కలియుగ వైకుంఠమ్ తిరుమల శ్రీవారి ఆలయంలో రద్దీ, దర్శన వివరాలు, మరికొన్ని విశేషాల గురించి తెలియచేస్తాను, ముందుగా శ్రీవారి ఆలయంలో దర్శన వివరాలు...
నిన్న శుక్రవారం 62,625 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 34,462 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. 3.63 కోట్ల హుండీ కానుకలు వచ్చాయి. భక్తుల రద్దీ చూస్తే విపరీతంగా పెరిగింది. మొత్తం కంపార్ట్మెంట్స అన్నీ నిండిపోయి. శిలాతోరణం వరకు క్యూ లైన్ ఉంది. టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు శ్రీవారి దర్శనానికి 18 నుంచి 24 గంటలు పడుతోంది.
ఇక తిరుమల
శ్రీవారి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం శాస్త్రోక్తంగా పవిత్ర
సమర్పణ జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో
శ్రీ
జె.శ్యామలరావు దంపతులు పాల్గొన్నారు.
ఈ
సందర్భంగా ఉదయం యాగశాలలో హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. ఆ తరువాత
సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో
విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం వేద ఘోష, మంగళవాయిద్యాల నడుమ శ్రీవారి మూలవర్లకు, ఉత్సవ మూర్తులకు, జయవిజయులకు, గరుడాళ్వారుకు, వరదరాజస్వామివారికి, వకుళమాత అమ్మవారికి, ఆనంద నిలయం, యాగశాల, విష్వక్సేనులవారికి, యోగనరసింహస్వామి వారికి, భాష్యకార్లకు, పోటు తాయారుకు, ధ్వజస్తంభం, బలిపీఠం, శ్రీభూవరాహస్వామివారికి, శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి
పవిత్రమాలలు సమర్పించారు.
అనంతరం సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. రాత్రి 8 నుంచి 11 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరుగనున్నాయి. ఈ కారణంగా శ్రీవారి ఆలయంలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది.
ఇక తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం సందర్భంగా శుక్రవారం అమ్మవారు స్వర్ణరథంపై ఆశీనులై భక్తులను కటాక్షించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి ప్రపత్తులతో నాలుగుమాడ వీధుల్లో రథాన్ని లాగారు. కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు.
స్వర్ణరథోత్సవంలో
ఈవో శ్రీ జె. శ్యామల రావు దంపతులు, ఎస్ ఇ
శ్రీ జగదీశ్వర్‌రెడ్డి, ఆలయ
డెప్యూటీ ఈవో శ్రీ గోవింద రాజన్, ఆలయ
అర్చకులు శ్రీ బాబుస్వామి, సూపరింటెండెంట్
శ్రీమతి శ్రీవాణి, విశేషసంఖ్యలో
భక్తులు పాల్గొన్నారు.
మరోవైపు
తిరుమల శ్రీవారి ఆలయానికి కొప్పెర వారి పల్లికి చెందిన శ్రీ కామినేని శ్రీనివాసులు,
కుటుంబ సభ్యులు
కుప్పెర హుండీని బహుకరించారు.
శ్రీవారి
ఆలయం ముందు టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరికి దాత కొప్పెర హుండీని
అందించారు.
ఈ
కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఇవి
ప్రస్తుతానికి తిరుమల శ్రీవారి ఆలయంలో కొన్ని విశేషాలు. మరికొన్ని విశేషాలతో రేపటి
పోస్ట్‌లో కలుసుకుందాం. నమస్తే
14, ఆగస్టు 2024, బుధవారం
23, జులై 2024, మంగళవారం
19, జులై 2024, శుక్రవారం
సింహగిరి ప్రదక్షిణకు సర్వం సిద్దం/మార్గదర్శకాలివే /vizag simhachalam giri pradakshina
భూప్రదక్షిణ
తో సమానమైన ఫలితాన్నిచ్చే సింహాచలం గిరిప్రదక్షిణకు సర్వం సిద్ధమైంది. మరికొన్ని
గంటల్లో గిరిప్రదక్షిణ సంబరం ప్రారంభమవబోతోంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు,
పర్యవేక్షణ పూర్తయిందని దీనికి సంబంధించిన వివరాలను కూడా ప్రకటించారు అధికారులు.
గిరిప్రదక్షిణను పురస్కరించుకొని 20,21 తేదీల్లో రెండురోజులు ఆర్జిత
సేవలు రద్దు చేసినట్టు ఆలయ అధికారులు ప్రకటించారు. ఈ నెల 20,21 తేదీలు రెండు రోజుల్లోను సింహాచలం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో
సుప్రభాతసేవ, ఆరాధన, నిత్యకళ్యాణం అష్టోత్తరం, సహస్రనామార్చన వంటి ఆర్జితసేవాలను
రద్దు చేసినట్టు ఆలయ అధికారులు ప్రకటించారు. గిరిప్రదక్షిణ కారనంగాం భక్తులు లక్షల
సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ
రెండు రోజులు నీలాద్రి ద్వారం నుంచి మాత్రమె దర్శనాలకు అనుమతి ఇస్తున్నట్టు ఆలయ
అధికారులు ప్రకటించారు.
అలాగే
ఈ రెండు రోజుల్లోనూ అడవివరం,
సింహాచలం ప్రాంతాలలోని మద్యం షాపులు మూసివాయాలని ఆ ప్రదేశాలలోని షాపులకు నోటీసులు
కూడా జారీచేసారు. అలాగే giri
ప్రదక్షిణలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు కూడా
తీసుకుంటున్నట్టు అధికారులు ప్రకటించారు.
32
కిలోమీటర్ల మేర జరిగే ఈ ప్రదక్షిణలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని
ఏర్పాట్లు చేసామని ప్రకటించారు. ఎక్కడికక్కడ వైద్య,కనీస అవసరాలకు సంబంధించి అన్ని
ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. గిరిప్రదక్షిణ మార్గంలో 11 మెడికల్ క్యాంపులు, 290 తాత్కాలిక, 169 శాశ్వత మరుగుదొడ్లు, వంద సిసి కెమెరాలు అమర్చారు. ప్రధాన
కూడళ్ళలో అంబులెన్స్ లను సిద్ధ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు సమాచారం తెలిపేలా
అనౌన్స్మెంట్ సిస్టం కూడా అందుబాటులో ఉంచారు.
ఇప్పటికే
సింహాచలం గిరిప్రదక్షిణ రూట్ మేప్ కూడా ప్రకటించింది. సింహాచలం తొలి పావంచా వద్ద
మొదలుపెట్టి అడవివరం,
ధారపాలెం,
ఆరిలోవ, హనుమంతువాక, పోలీస్ క్వార్టర్స్, కైలాసగిరి టోల్ గెట్, అప్పుఘర్ జంక్షన్, mvp డబుల్ రోడ్, వెంకోజీపాలెం, hb కాలనీ కైలాసపురం, మాదవదార, మురలీనగర్, బుచ్చిరాజుపాలెం, లక్ష్మీనగర్, ఇందిరా nagar, ప్రహ్లాదాపురం, గోశాల జంక్షన్, నుంచి తోలిపావంచాకు చేరుకొని
అక్కడినుంచి సింహాచలం మెట్ల మార్గం నుంచి ఆలయానికి చేరుకుంటారు.
సింహాచలం
గిరిపదక్షిణ సందర్భంగా విశాఖ నగర పోలీస్ కమేశానర్ డా.శంఖబ్రత బాగ్చి.
ఆదేశాలతో
రవాణాశాఖ ట్రాఫిక్ ఆంక్షలు కూడా జారీ
చేసింది. అనకాపల్లి నుంచి శ్రీకాకుళం, విజయనగరం వైపు వెళ్ళే వాహ్నదరులను విశాఖపట్నం సిటీ గుండా వెళ్ళడానికి
అనుమతించరని తెలిపారు. విశాఖపట్నం సిటి నుంచి కాకుండా లంకెలపాలెం, సబ్బవరం,పెందుర్తి, ఆనందపురం ద్వారా వెళ్లాలని
సూచించారు.
ఇక
గిరిప్రదక్షినకు వచ్చేవారి వాహనాల పార్కింగ్ విషయంలో కూడా మార్గదర్శకాలు జారీ
చేసారు. నడిచి వెళ్ళే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా పార్కింగ్ ఏర్పాట్లు
చేసారు. విజయనగరం మార్గంల్ వచ్చి భక్తులు అడవివరం వద్దా, హనుమంతవాకవైపు నుంచి వచ్చేవారు
సెంట్రల్ జైలు వద్ద రూరల్ ప్రాంతాల నుచ్న్హి వచ్చేవారు సింహపురి కాలనీలోను తమ
వాహనాలను పార్కింగ్ చేసుకోవలసిందిగా సూచించారు.


.jpg)







