19, జులై 2024, శుక్రవారం

సింహగిరి ప్రదక్షిణకు సర్వం సిద్దం/మార్గదర్శకాలివే /vizag simhachalam giri pradakshina

 

భూప్రదక్షిణ తో సమానమైన ఫలితాన్నిచ్చే సింహాచలం గిరిప్రదక్షిణకు సర్వం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో గిరిప్రదక్షిణ సంబరం ప్రారంభమవబోతోంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు, పర్యవేక్షణ పూర్తయిందని దీనికి సంబంధించిన వివరాలను కూడా ప్రకటించారు అధికారులు.

గిరిప్రదక్షిణను పురస్కరించుకొని 20,21 తేదీల్లో రెండురోజులు ఆర్జిత సేవలు రద్దు చేసినట్టు ఆలయ అధికారులు ప్రకటించారు. ఈ నెల  20,21 తేదీలు రెండు రోజుల్లోను సింహాచలం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సుప్రభాతసేవ, ఆరాధన, నిత్యకళ్యాణం అష్టోత్తరం, సహస్రనామార్చన వంటి ఆర్జితసేవాలను రద్దు చేసినట్టు ఆలయ అధికారులు ప్రకటించారు. గిరిప్రదక్షిణ కారనంగాం భక్తులు లక్షల సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉంది  కాబట్టి ఈ రెండు రోజులు నీలాద్రి ద్వారం నుంచి మాత్రమె దర్శనాలకు అనుమతి ఇస్తున్నట్టు ఆలయ అధికారులు ప్రకటించారు.

అలాగే ఈ రెండు రోజుల్లోనూ అడవివరం, సింహాచలం ప్రాంతాలలోని మద్యం షాపులు మూసివాయాలని ఆ ప్రదేశాలలోని షాపులకు నోటీసులు కూడా జారీచేసారు. అలాగే giri ప్రదక్షిణలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు కూడా తీసుకుంటున్నట్టు అధికారులు ప్రకటించారు.

32 కిలోమీటర్ల మేర జరిగే ఈ ప్రదక్షిణలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసామని ప్రకటించారు. ఎక్కడికక్కడ వైద్య,కనీస అవసరాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. గిరిప్రదక్షిణ మార్గంలో 11 మెడికల్ క్యాంపులు, 290 తాత్కాలిక, 169 శాశ్వత మరుగుదొడ్లు, వంద సిసి కెమెరాలు అమర్చారు. ప్రధాన కూడళ్ళలో అంబులెన్స్ లను సిద్ధ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు సమాచారం తెలిపేలా అనౌన్స్మెంట్ సిస్టం కూడా అందుబాటులో ఉంచారు.

ఇప్పటికే సింహాచలం గిరిప్రదక్షిణ రూట్ మేప్ కూడా ప్రకటించింది. సింహాచలం తొలి పావంచా వద్ద మొదలుపెట్టి అడవివరం, ధారపాలెం, ఆరిలోవ, హనుమంతువాక, పోలీస్ క్వార్టర్స్, కైలాసగిరి టోల్ గెట్, అప్పుఘర్ జంక్షన్, mvp డబుల్ రోడ్, వెంకోజీపాలెం, hb కాలనీ కైలాసపురం, మాదవదార, మురలీనగర్, బుచ్చిరాజుపాలెం, లక్ష్మీనగర్, ఇందిరా nagar, ప్రహ్లాదాపురం, గోశాల జంక్షన్, నుంచి తోలిపావంచాకు చేరుకొని అక్కడినుంచి సింహాచలం మెట్ల మార్గం నుంచి ఆలయానికి చేరుకుంటారు.

సింహాచలం గిరిపదక్షిణ సందర్భంగా విశాఖ నగర పోలీస్ కమేశానర్ డా.శంఖబ్రత బాగ్చి.

ఆదేశాలతో రవాణాశాఖ  ట్రాఫిక్ ఆంక్షలు కూడా జారీ చేసింది. అనకాపల్లి నుంచి శ్రీకాకుళం, విజయనగరం వైపు వెళ్ళే వాహ్నదరులను విశాఖపట్నం సిటీ గుండా వెళ్ళడానికి అనుమతించరని తెలిపారు. విశాఖపట్నం సిటి నుంచి కాకుండా లంకెలపాలెం, సబ్బవరం,పెందుర్తి, ఆనందపురం ద్వారా వెళ్లాలని సూచించారు.

ఇక గిరిప్రదక్షినకు వచ్చేవారి వాహనాల పార్కింగ్ విషయంలో కూడా మార్గదర్శకాలు జారీ చేసారు. నడిచి వెళ్ళే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా పార్కింగ్ ఏర్పాట్లు చేసారు. విజయనగరం మార్గంల్ వచ్చి భక్తులు అడవివరం వద్దా, హనుమంతవాకవైపు నుంచి వచ్చేవారు సెంట్రల్ జైలు వద్ద రూరల్ ప్రాంతాల నుచ్న్హి వచ్చేవారు సింహపురి కాలనీలోను తమ వాహనాలను పార్కింగ్ చేసుకోవలసిందిగా సూచించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి