క్షీరసాగరం
నుంచి ఏమేం ఆవిర్భవించాయి? ఎవరు స్వీకరించారు?
హాలాహలం – గరళం దీనిని
పరమేశ్వరుడు స్వీకరించాడు.
సురభి లేదా కామధేనువు – తెల్లని ఆవు –కోరిన కోరికలు తీర్చగల
అపరిమితమైన శక్తి గల గోమాత. సకల గో సంతతికి మాత. కామదేనువును దేవమునులు తీసుకున్నారు
ఉచ్ఛైశ్రవము – ఎత్తైన
తెల్లని, ఐదు తలల గుఱ్ఱము. ఒక దివ్యాశ్వం. దీనిని బాలి చక్రవర్తి తీసుకున్నాడు.
ఐరావతము – నాలుగు దంతాలు కలిగిన
తెల్లని ఏనుగు – దీనిని ఇంద్రుడు తీసుకున్నాడు.
కల్పవృక్షం – కోరికలు తీర్చే దివ్యమైన దేవతా వృక్షం. ఇది
స్వర్గలోకంలో ప్రతిష్టించబడింది.
దేవతా
సుందరీమణులు, రంభ,మేనక,ఘ్రుతాచి, తిలోత్తమ, సుకేశి, చిత్రలేఖ, మంజుఘోష మొదలైన అప్సరసలు ఉద్భవించారు.
సుధాకరుడు
అంటే చంద్రుడు కూడా క్షీరసాగర మధనంలో
ఉద్బవించగా, శివుడు తన శిరస్సున శిగలో ధరించాడు.
సకల సంపదలకు అధి
దేవతలక్ష్మీదేవి క్షీరసాగరం నుంచి ఆవిర్భవించింది. లక్ష్మీదేవిని శ్రీమహావిష్ణువు
స్వీకరించాడు.
ఇక క్షీరసాగర మాధనంలోనే
ఉద్భవించింది వారుణి – మద్యానికి అధిదేవత. వారుణిని రాక్షసులు స్వీకరించారు.
ఇంకా దివ్య ఛత్రం,దివ్య ధనుస్సు,దివ్యశంఖం ఇలా చాలా దివ్య వస్తువులు ఉద్భవించాయి.
చివరిగా అమృత భాండంతో ధన్వంతరి
ఆవిర్భవించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి