హిందూ
పురాణాల్లో మనకు తెలియని ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి. ఎన్నిసార్లు విన్నా...
ఎంత తరచి తరచి తెలుసుకున్నా ఇంకా ఏదో మనకు తెలియని రహస్యాలు ఉంటూనే ఉంటాయి. వాటిలో
క్షీరసాగర మథనం కూడా ఒకటి. అవును, క్షీరసాగర మథనం లో ఎన్నో అద్భుతాలు...
రహస్యాలు... ఇంకెన్నో గూడార్ధాలు... మర్మాలు, దాగి ఉన్నాయి.
క్షీర సాగర మాధనంలోనే శ్రీమహావిష్ణువు యొక్క రెండు అవతారాలు ఉద్భవించాయి ఆ
అవతారాలు ఏంటి? ఎ సందర్భంలో, ఎందుకు
ఉద్భవించాయి? క్షీరసాగర మధనంలో అమృతంతో పాటు హాలాహలం, కామధేనువు, కల్పవృక్షం లాంటి ఎన్నో విశిష్ట
వస్తువులు, జీవులు... చంద్రుడు,
లక్ష్మీదేవి తో పాటు మరెంతో మంది దేవీ దేవతలు కూడా ఆవిర్భవించారు.. ఆ ఆవిర్భవించిన
దేవీ దేవతలు ఎవరు? ఎందుకు ఉద్భవించారు?
అసలు క్షీరసాగర మధనం
ఎందుకు జరిగింది? క్షీర సాగర మధనంలో దేవదానవులు
పాల్గొన్నారు. బద్ధ శత్రువులైన దేవదానవులు కలిసి ఎందుకు క్షీరసాగరాన్ని చిలికారు.
పాలసముద్రం మధించడంలో దేవదానవులకు సహకరించిన జీవజాతులు ఏంటి?
క్షీరసాగర మధనంలో నాగజాతి పాత్ర ఎంతవరకు ఉంది? అన్నిటి కంటే
ప్రధానమైన ప్రశ్న దేవదానవులు క్షీరసాగరాన్ని ఎందుకు మధించారు? ఇలా క్షీరసాగర మధనం
గురించి ఎన్నో ప్రశ్నలు వస్తాయి...
క్షీరసాగర మథనానికి కారణం ఓ శాపమా!
క్షీరసాగర మధనం...పాల సముద్రాన్ని మధించడం. అసలెందుకు జరిగింది. పౌరాణిక చరిత్రలో ఎన్నో సంఘటనలకు అంకురం వేసింది మహర్షుల శాపాలే. అలాగే ఈ క్షీరసాగర మథనం ఘటనకు కూడా మూలం ఒక శాపం. కోపానికి పరాకాష్ట అయిన దూర్వాస మహర్షి శాపం. సాగరమథనంలో విశేషాలను తెలుసుకునేముందు పాల సముద్ర మథనానికి దారితీసిన ఆ శాప కథనమేంటో ముందుగా తెలుసుకుందాం..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి